![]() |
![]() |

చల్లని రాతిరి వెన్నెల్లో సరదాల పందిరిలో అంటూ లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఆర్జే సూర్య, ఇనయా సుల్తానా.. వీళ్ళిద్దరు కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్తున్నట్టుగా ఇనయా తన యూట్యూబ్ చానెల్ లో వీడియోని అప్లోడ్ చేసింది.
బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6 లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా.
ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది. అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది.
ఇనయా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన ఫ్యాన్స్ కి తెలియజెయ్యాలనే ఉదేశ్యంతో తన ప్రతి అప్డేట్ ని షేర్ చేస్తుంది. నిన్న మొన్నటిదాకా ఇనయా దుబాయ్ లోని అబుదాబికి వెళ్లి, అక్కడ పొట్టి డ్రెస్ లో దిగిన కొన్ని ఫోటోలని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆర్జే సూర్యతో కలిసి లాంగ్ డ్రైవ్ అంటూ ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు.
ఇక కార్ లో వెళ్తూ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. నువ్వు దుబాయ్, ఊటీ అంటు సింగిల్ గా వెళ్తే మరి నీ వీడీయోలు, ఫోటోలు ఎవరు తీస్తారని ఆర్జే సూర్య అడుగగా.. నేను తీస్తానని ఇనయా చెప్పింది. కథలొద్దు నిజం చెప్పు, ఎవరు లేకుండా అలా ఎలా వ్లాగ్స్ తీస్తావని అడుగగా.. ఫోటోగ్రాఫర్ కి ఒక వేయి రూపాయలు ఎక్కువ ఇస్తానంటే వాడే తీస్తాడని ఇనయా అంది. ఆ తర్వాత ఇనయాని పాట పాడమని సూర్య అడుగగా.. ఈ వీడియో చూసే జనాలు తిడతారు, మొహం మీద ఊసేస్తారని ఇనయా అంది. సూర్యని పాడమని ఇనయా అనగా.. చల్లని రాతిరి వెన్నెల్లో సరదాల పందిరిలో అంటూ పాడాడు సూర్య. ఇలా ఇద్దరు కలిసి చాలా రోజుల తర్వాత లాంగ్ డ్రైవ్ అంటూ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
![]() |
![]() |